Site icon NTV Telugu

నోరా ఫతేహి అందానికి 30 మిలియన్ల మంది దాసోహం

Nora Fatehi Crossed 30 Million followers

నోరా ఫతేహి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. సోషల్ మీడియా ఉపయోగించే నెటిజన్లకు అయితే ఆమె ఇంకా బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి తన అద్భుతమైన రూపంతో అభిమానులను ట్రీట్ చేయడంలో దిట్ట. ఆమె తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులే అయినా, పాశ్చాత్య దుస్తులే అయినా ఈ బ్యూటీ తన స్టైల్, హాట్ లుక్స్ తో నెటిజన్ల దృష్టిని తనవైపుకు మళ్లించుకుంటుంది. ఇప్పుడు నోరా ఫతేహి ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించారు.

Read Also : సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” కూడా..!!

అంటే ఆమె అందానికి ఏకంగా 30 మిలియన్ల మంది దాసోహం అయ్యారన్నమాట. ఇది ఆమెకు ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా నోరా చిరుత ప్రింట్ బ్రాలెట్, మ్యాచింగ్ స్కర్ట్‌తో తన అద్భుతమైన అవతార్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఆమె అభిషేక్ దుధయ్య దర్శకత్వం వహించిన హిందీ బిగ్ బడ్జెట్ చిత్రం “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”లో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది ఆగస్టు 11న మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్, అమీ విర్క్, ప్రణీత సుభాష్, ఇహానా ధిల్లాన్ నటించారు.

Exit mobile version