July Movies : సినిమాలు లేక.. ఖాళీగా దర్శనమిస్తోన్న థియేటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై మొదలవడంతోనే నిరాశపరిచింది. గత వారం వచ్చిన నితిన్ తమ్ముడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి డిస్ట్రిబ్యూటర్స్ ను నిండా ముంచేసింది. కొన్ని ఏరియాలలో సాయంత్రం షోస్ కూడా పడలేదంటే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక నవీన్ చంద్ర షో టైమ్ పరిస్థితి కూడా ఇంతే. కాకుండా ఈ సినిమాను కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేయడం వలన ఎవరికీ నష్టాలు ఏమి లేవుకానీ థియేటర్స్ షోస్ కూడా పడని పరిస్థితి.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే
Also Read
ఇక ఈ వారం కూడా పరిస్థితి దాదాపు ఇంతే. సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ ఈ రోజు థియేటర్స్ లో విడుదలవుతోంది. వారానికి ఓ సినిమాతో వస్తున్న సుహాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాకు బజ్ అంతగా ఏమి లేదు. ట్రైలర్ కూడా అంతంత మాత్రమే. ఇక చక్రవాకం సీరియల్ తో గుర్తింపు తెచుకున్న ఆర్కే నాయుడు నటించిన చిత్రం 100. రెండు రోజుల ముందుగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించిన ఈ సినిమా వస్తున్నట్టు తెలీదు. సినిమాకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చాలా వీక్ గా చేసారు. ఈ రెండిటితో పాటు వర్జిన్ బాయ్స్ అనే సినిమా కూడా నేడు రిలీజ్ అవుతుంది. కేవలం ఓటీటీ కోసమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్టు ఉంది ఈ సినిమా. ఈ మూడు సినిమాలు లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. స్టార్స్ సినిమాలు ఏమి లేక థియేటర్స్ లు ఖాళీగా ఉంటున్నాయి. చిన్న సినిమాల వలన థియేటర్స్ ఓనర్స్ కు కనీసం రెంట్ ఖర్చులు కూడా రావడం లేదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!