Site icon NTV Telugu

Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట!

Puri Vijay Sethupathi

Puri Vijay Sethupathi

లైగ‌ర్‌, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక చేసేలా సిద్ధమవుతున్నాడు.

Read More : Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్

ముందుగా ఈ టీంలోకి టబు వచ్చింది, తర్వాత దునియా విజయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ప్రచారం జరిగింది. వారిలో ఒకరు నివేదా థామస్, మరొకరు రాధికా ఆప్టే అని ప్రచారం మొదలైంది. అయితే, ఇది కేవలం ప్రచారం మాత్రమే, ఎందుకంటే వీరిద్దరి పేర్లు పరిశీలనలో లేవు. నిజానికి, ఈ సినిమాలో ఒకే ఒక హీరోయిన్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగు డైరెక్టర్, తమిళ హీరో, కన్నడ విలన్, బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో క్రేజ్ ఉన్న డబ్బు లాంటి నటిని రంగంలోకి దించిన పూరీ, హీరోయిన్‌ను బాలీవుడ్ నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది.

Read More : Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది

ఇప్పటికే ఒక హీరోయిన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, అగ్రిమెంట్ చేసి అనౌన్స్ చేయడమే ఆలస్యం. ఈ సినిమాకు బెగ్గర్ అనే పేరును పరిశీలిస్తున్నారు. షూటింగ్ మొదలైతే 60 రోజుల్లో పూర్తి చేయాలని పూరీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాడు. వచ్చే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని పరిశీలిస్తున్నారు.

Exit mobile version