నివేతా థామస్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం 35 చిన్న కథ కాదు. ఈ చిత్రంలో తల్లి పాత్రలోనటిస్తోంది నివేతా థామస్. గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచెవరెవరాలో 12వ తరగతి విద్యార్థినిగా నటించింది. మరియు ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది నివేతా థామస్. ఇందులో భాగంగా తల్లి పాత్ర పోషించడం వల్ల కెరీర్‌పై ప్రభావం చూపుతుందా మీడియా ప్రశ్నించగా విభిన్న పాత్రలలో నటించాలనే తన అభిరుచిని వ్యక్తం చేసింది. “నాకు కావలసింది అదే. నేను అన్ని రకాల పాత్రలను అన్వేషించాలనుకుంటున్నాను. నా నెక్ట్స్ సినిమాలో మధ్య వయస్కురాలి పాత్ర లాంటిది ఏదైనా ఎంచుకోవచ్చు” అని తెలిపింది.
Also Read: Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
కాగా మలయాళ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన లైంగిక వేధింపులు, హేమా కమిటీ నివేదికపై నివేతాను ప్రశించిగా అందుకు సమాధానంగా బదులిస్తూ “మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం, ప్రస్తుతం జరిగే పరిణామాలను నేను నిశితంగా గమనిస్తున్నాను, హేమ కమిటీని ఏర్పాటుకు కారణమైన WCC ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా అమలు చేయాలనీ నేను ఆశిస్తున్నాను, ఈ మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం చాలా కీలకం” ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేస్ లో ఉంటున్నాం, సో సురక్షితమైన వాతావరనం ఉండడం చాలా ముఖ్యం” అని నివేతా థామస్ తెలిపారు. హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కు నైతిక భాద్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ స్టార్ మోహన్ లాల్ రాజీనామా చేసారు.
#NivethaThomas responded on #HemaCommitteeReport at #35Chinnakathakadhu Promotions pic.twitter.com/FvtbZJZCYB
— Ramesh Pammy (@rameshpammy) August 31, 2024