Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!

Nithya Menen Marriage News

Nithya Menen Marriage News

Nithya Menen: ఇన్నాళ్లూ ఆ స్టార్ హీరోయిన్‌కు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని, జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె తన మనసులోని అసలు మాటను బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. నేచురల్ బ్యూటీ నిత్యా మేన్. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, పెళ్లి ఆలోచనలపై నిత్యా చాలా క్లారిటీగా మాట్లాడారు.

గతంలో తాను పెళ్లి గురించి మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తాను పెళ్లికి వ్యతిరేకమని ఎప్పుడూ అనలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, కాకపోతే ఎలాంటి వ్యక్తి జీవితంలోకి రావాలి, ఆ బంధం ఎలా ఉండాలి అనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందని తెలిపారు. కేవలం పెళ్లి అనే మాట కోసం కాకుండా, సరైన వ్యక్తితో ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకోవడమే తన ఉద్దేశమని ఆమె వివరించారు.

ఇక తన స్వభావం గురించి మాట్లాడుతూ నిత్యా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బయట జనంలోకి వెళ్లడం, నలుగురి మధ్య కనిపించడం తనకు మొదటి నుంచీ అంతగా ఇష్టం ఉండదని చెప్పారు. చిన్నప్పుడు ఎవరైనా తన వైపు తదేకంగా చూస్తుంటే, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పేదాన్ని అంటూ నవ్వేశారు. తనకు సిగ్గు చాలా ఎక్కువని, పబ్లిక్‌లో ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే అలాంటి అసౌకర్యం ఎదురైనప్పుడే దానికి కారణమేంటో తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ సవాళ్ల నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటానని నిత్యా తెలిపారు. ప్రస్తుతం నిత్యా మేనన్ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి పెళ్లి వార్తలపై నిత్యా మేనన్ ఇచ్చిన ఈ లేటెస్ట్ క్లారిటీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.