టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల అని ఆ మధ్య అధికారకంగా ప్రకటన కూడా చేసారు మేకర్స్.
కానీ ఇప్పుడు పరిస్థితులు చుస్తే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్రిస్మస్ రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ ఇప్పడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటికి నిన్న రాబిన్ హుడ్ ను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రాబిన్ హుడ్ రాదని మరో న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ విషయమై నిర్మాతలతో హీరో నితిన్ భేటీ అయినట్టు తెలుస్తోంది. శివరాత్రికి రిలీజ్ చేద్దామని నిర్మాతలు ఆలోచనట. కానీ సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయమని హీరోగారి వాదన. చాలా కాలంగా హిట్ లేక ఆశగా ఎదురుచూస్తున్న నితిన్ కు రాబిన్ హుడ్ హిట్ కల నెరవేరుస్తుందని భావిస్తున్నాడు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేస్తే ఓపెనింగ్ ఉంటుందని హీరో భావిస్తున్నారట. కానీ నిర్మాతల వాదన మరోల ఉందట. చివరికి ఎవరి నిర్ణయానికి ఓటు పడుతుందో చూడాలి.