ఓటీటీ వైపు నితిన్ ‘మాస్ట్రో’ చూపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉందట. దానిని జూన్ రెండో వారం నాటికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. విశేషం ఏమంటే… ఈ సినిమా ఓటీటీ హక్కులకు చక్కని డిమాండ్ ఏర్పడిందట. ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఆఫర్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. అయితే… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విశేషం ఏమంటే… కథ రీత్యా కూడా ‘మాస్ట్రో’ను ఓటీటీలో విడుదల చేస్తేనే బెటర్ అనే భావన ఫిల్మ్ నగర్ లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే… హిందీలో ఇలాంటి బోల్డ్ టైప్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ అయినా అక్కడ చూస్తారు కానీ, తెలుగువారు ఎంతవరకూ వీటిని అంగీకరించి, ఆదరిస్తారనే చిన్న సందేహం లేకపోలేదు. ఆ రకంగా చూసినప్పుడు థియేటర్లలో కంటే… ఓటీటీలో విడుదలైతేనే ‘మాస్ట్రో’కు సరైన గుర్తింపు, ఆదరణ లభిస్తాయన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మరి నితిన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి!
Also Read
- Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. 'పెద్ది' షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
- IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
- Tags
- Maestro Movie
- Nithin
- OTT
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..