Site icon NTV Telugu

Macherla Niyojakavargam: హైదరాబాద్‌ వేదికగా.. మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఫంక్షన్

Macherla Niyojakavargam

Macherla Niyojakavargam

Macherla Niyojakavargam Pre Release Function:

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రుప‌నున్నట్లు మేక‌ర్స్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను జ‌రిపిన విషయం తెలిసిందే. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్టర్‌గా క‌నిపించ‌నున్నాడు.

read also: Niti Aayog: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ

అయితే హీరో నితిన్ కు కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో మాదిరిగా అయితే సక్సెస్ కావడం లేదు. హీరో నితిన్‌ నుంచి 2020 లో వచ్చిన భీష్మ సినిమా మాత్రమే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. నితిన్‌ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో.. గత ఏడాది నుంచి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్‌.

దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నిర్వహించిన చెక్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. నితిన్‌ ఆతర్వాత నటించిన రంగ్ దే సినిమా కూడా అభిమానులకు తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే.. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. దీంతో.. ఓ వర్గం ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో నితిన్ 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈసినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ చిత్రంలో క్యాథెరీన్ థెరిస్సా కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ & ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించగా.. ఎడిటర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు. ప్ర‌సాద్ మూరెళ్ళ‌ సినిమాటోగ్రపీ నిర్వహించారు. అయితే.. ఈసినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధి ఎవరు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version