కేరళ హీరోయిన్లకు తెలుగులో ఉండే క్రేజే వేరు. అందుకే అక్కడ ఒకటి రెండు చిత్రాలతో క్లిక్ కాగానే.. టాలీవుడ్‌లోకి పట్టుకొచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన మరో మళయాళీ సోయగం నిఖిలా విమల్. అల్లరి నరేష్ మేడమీద అబ్బాయితో టాలీవుడ్ తెరంగేట్రమిచ్చిన నిక్కీ.. మోహన్ బాబు గాయత్రిలోనూ నటించింది. ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు సరికదా.. ఆఫర్లను అందించలేకపోయాయి. టాలీవుడ్ ఆదరించకపోయే సరికి సొంత గూటికి చేరిపోయింది నిఖిలా విమల్. పరుగెత్తి పాలు తాగడం ఎందుకు.. నిల్చుని నీళ్లు తాగుదాం అని డిసైడయ్యి మాలీవుడ్ పై ఫోకస్ చేసింది. మల్లూవుడ్ వరుస ఆఫర్లతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ డమ్ తెచ్చుకుంది. అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు కొల్లగొడుతూ సక్సెస్ అందుకుంది. ఈ అమ్మడు నటిస్తే.. సినిమా హిట్టే అనే టాక్ ఉంది. ద ప్రీస్ట్, తంబి, జో అండ్ జో, పోర్ తొజిల్, గురువాయిర్ అంబలనడయిల్, నునాకుజి, వాజై చిత్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్.
Bollywood Heroines: వరుసగా మదర్ హుడ్ లోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నిఖిలా విమల్‌ను మాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మార్చేశాయి. దీంతో ఛాన్సులు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కానీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ సక్సెస్ రేష్యోను కాపాడుకునేందుకు ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. ప్రజెంట్ మేడమ్ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. పెన్ను కేస్, నివిన్ పాలీ తారం చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఆర్యతో బైలింగ్వల్ మూవీతో పాటు అనాలి అనే వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేస్తోంది నిక్కీ. ఇలా తమిళ, మలయాళంలో బిజీగా ఉన్న బ్యూటీ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పుడు పలకరిస్తుందో..? వేచి చూడాలి.