Site icon NTV Telugu

Niharika NM : నాకు ‘తేడా’ కథలు ఇష్టం.. అందుకే ‘పెరుసు’ చేశా!

Niharika Nm

Niharika Nm

తెలుగు అమ్మాయి నిహారిక ఎన్.ఎం. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాని సైతం ఆమె ప్రమోట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా మారుతూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలితో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిహారిక మీడియాతో ముచ్చటించింది.

Also Read : Srinidhi Shetty : ప్రశాంత్ నీల్ Pookie.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ క్రమంలోనే ఆమెకు ఎలాంటి జోనర్ సినిమాలు ఇష్టం?, ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు? అని అడిగితే, తనకు సింపుల్‌గా ఉన్న కథలు చేయడం పెద్దగా ఇంట్రస్ట్ ఉండదని, కథలో ఏదైనా భిన్నంగా, కొంచెం వియర్డ్ అంటే తేడాగా ఉన్న సినిమాలంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన మొదటి తమిళ సినిమా పెరుసు గురించి ప్రస్తావించగా, “అది కొంచెం తేడాగా అనిపిస్తుంది, కాబట్టే అలాంటి సినిమా చేశారా?” అని అడిగితే, అది చూడడానికి తేడాగానే అనిపిస్తుంది కానీ, సినిమాలో అలాంటి కంటెంట్ పెద్దగా ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ పాయింట్ వినగానే తేడాగా అనిపించిందని, అందుకే ఆ సినిమాకి కూడా సైన్ చేశానని అన్నారు. అయితే, మిత్ర మండలి సినిమా దానికన్నా ముందే ఒప్పుకున్నామని, కాకపోతే ఇది కాస్త ఆలస్యమైంది కానీ, పెరుసు తమిళ్‌లో రిలీజ్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది

Exit mobile version