నిహారిక కొణిదలకు పెళ్ళైనా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు! భర్తతో కలిసి తన గ్యాంగ్ తో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో నిహారిక స్టార్స్ గెటప్స్ వేయించడమే దీనికి తాజా ఉదాహరణ. అంతే కాదు.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. సందర్భం ఏమిటో చెప్పలేదు కానీ తమకు ఇష్టమైన స్టార్స్ దుస్తుల్ని వేసుకుని, ఇమిటేట్ చేశామంటూ నిహారిక ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. విశేషం ఏమంటే… నిహారిక తన పెదనాన్న చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో శ్రీదేవి గెటప్ లో ఫోటోకు ఫోజిచ్చింది.
Read Also : ముందు ఇంటర్నెట్ లో… తరువాత ఈడియట్ బాక్స్ లో… బిగ్ బాస్ 14 షురూ!
ఇక ఆమె భర్త చైతన్య ‘బావగారు బాగున్నారా’లోని చిరంజీవి ఫోజును దించేశాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ ‘క్షణక్షణం’లో వెంకటేశ్ తరహాలో కనిపించడానికి ప్రయత్నించాడు. విశేషం ఏమంటే… ఆ సినిమా కీరవాణి సంగీతం అందించారు. ఇక నిహారిక మిగిలిన స్నేహితులు ప్రణీత్, నిఖిల్, వివేక్, సహానా, శర్మిష్టా తదితరులు కూడా ‘ఘరానా మొగుడు, హలో బ్రదర్, గులాబీ, గోవింద గోవింద, కూలీ నెం.1, బొబ్బిలిరాజా’ మూవీస్ లోని గెటప్స్ తో అలరించారు. మొత్తానికి తన గ్యాంగ్ తో నిహారిక ఎంచక్కా క్వాలిటీ టైమ్ ను బాగానే స్పెండ్ చేస్తోంది.
