సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను నిరాశపరిచినా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది. అయితే ఆ సక్సెస్ ను నిధి అగర్వాల్ కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌తో చేసిన హీరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
Also Read : Vaa Vaathiyaar : కార్తీ.. ‘అన్నగారు వస్తారు’ ఇక తెలుగులో రారు.. డైరెక్ట్ గా అక్కడే రిలీజ్
నిధి అగర్వాల్ కెరీర్‌లో హరిహర వీరమల్లు మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి ఒక యువరాణి పాత్రలో నటించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్‌లో నిధి ఒక కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై వచ్చిన హైప్, క్రేజ్ చూసి ఈ సినిమా తనకు తప్పకుండా సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆశించిన నిధి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నిరాశకు లోనైంది. ఇప్పుడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. కానీ తమిళంలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. జయం రవితో చేసిన చిత్రాల తర్వాత, అక్కడ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఏదేమైనా వరుస ప్లాప్స్ నిధి అగర్వాల్ కు కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. మరి నిధి నెక్ట్స్ ఏ సినిమా చేస్తుందో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.