Site icon NTV Telugu

Nidhi Agarwal : హీరోతో ‘ఆ పని చేయొద్దు’ అంటూ అగ్రిమెంట్

Nidhiagerwal

Nidhiagerwal

నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ప్రజంట్ ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు బడా స్టార్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’, అలాగే ప్రభాస్ తో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది.

Also Read: Spirit : ‘స్పిరిట్’లో ప్రభాస్ అన్నగా ఆ స్టార్ హీరో..!

‘ బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైకేల్’ మూవీ తో నా సినీ కెరీర్ మొదలైంది. టైగర్ ప్రొఫ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్పై పై సంతకం చేయించుకుంది. సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో రాసి ఉన్నాయి. అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదు దాని అర్థం. అయితే కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా అవన్నీ చూడలేదు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. నటీనటులు ప్రేమలో పడితే మూవీ పై దృష్టిపెట్టరనన్ని ఆ టీమ్ భావించి ఇలాంటి షరతులు పెట్టి ఉంటుంది’ అని నిధి అగర్వాల్ తెలిపింది.

Exit mobile version