సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరికైనా విలువ. వరుస ప్లాపులు పలకరిస్తున్నప్పుడు కాస్త తగ్గి ఉండటం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం సహజంగా జరిగే పని. కానీ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేకపోయినా, ఆమె వైఖరిలో మాత్రం రవ్వంత కూడా మార్పు రాలేదని, తన వింత డిమాండ్లతో నిర్మాతలకు నిద్రలేని రాత్రులు మిగులుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో టాలీవుడ్ బడా నిర్మాతలెవరూ ప్రస్తుతం ఆమెవైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ.. 2024లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘తంత్ర’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘తంత్ర 2’లో నిధికి ఛాన్స్ దక్కింది. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం, ఆమె గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకోవడం విశేషం.
రెండు నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైన ‘తంత్ర 2’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల పట్టాలెక్కింది. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ ఉన్నట్టుండి ఆగిపోవడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. దీనికి ప్రధాన కారణం నిధి అగర్వాల్ వ్యవహారశైలే అని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాల భోగట్టా. సెట్స్‌లో ఆమె ప్రొఫెషనల్‌గా ఉండకపోవడం, గొంతెమ్మ కోర్కెలు కోరడం, ఏదో ఒక సాకు చెప్పి షూటింగ్స్ రద్దు చేసుకోవడంతో షెడ్యూల్స్ అన్నీ తారుమారవుతున్నాయట. ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేక చిత్రబృందం తలలు పట్టుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ‘తంత్ర 2’ షూటింగ్ నిలిచిపోవడంతో, అసలు ఈ ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్ కొనసాగుతుందా? లేక విసిగిపోయిన నిర్మాతలు ఆమెను పక్కనపెట్టి మరో హీరోయిన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చేతిలో పెద్ద ఆఫర్లు లేని సమయంలో వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవడం ఆమె కెరీర్‌కు ఎంతవరకు పనికొస్తుందో చూడాలి!

