కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాగా తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా మారింది నిధి!
Read Also : “ఆర్ఆర్ఆర్”ను బీట్ చేసేసిన “వాలిమై”
దర్శకుడు మిస్కిన్ ‘సైకో’ చిత్రంలో చివరి సారిగా కనిపించాడు ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు డైరెక్టర్ మగిల్ తిరుమేనితో కలసి సెట్స్ మీదకు వెళ్లాడు. ‘తడమ్’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన తిరుమేని ‘రెడ్ జెయింట్ మూవీస్’ బ్యానర్ పై తాజా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది ఉదయనిధి స్టాలిన్ స్వంత ప్రొడక్షన్ కంపెనీ కావటం విశేషం. ఇక ఉదయనిధి, నిధి అగర్వాల్ స్టారర్ కు అరోల్ కొరెల్లి సంగీతం సమకూర్చనున్నట్టు సమాచారం..