“ఆర్ఆర్ఆర్”ను బీట్ చేసేసిన “వాలిమై”

తల అజిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “వాలిమై” ఫస్ట్ లుక్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చారు “వాలిమై” మేకర్స్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు విడుదల కావడంతో “వాలిమై”ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. తాజాగా “వాలిమై” ఫస్ట్ లుక్ “ఆర్ఆర్ఆర్” మూవీ రికార్డ్స్ ను బీట్ చేసింది.

Read Also : ‘ఆహా’ అనిపిస్తోన్న నేహా చెల్లెలు! ప్యాంట్ కూడా పాపకి బరువైపోయిందట!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” గురించి కూడా అన్ని భాషల సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే “ఆర్ఆర్ఆర్” ఫస్ట్ లుక్ కు 16 గంటల్లో 463కే లైక్స్ రాగా, అదే సమయంలో “వాలిమై”కు 1 మిలియన్ ప్లస్ లైక్స్ రావడం విశేషం. అజిత్ ఫ్యాన్సా మజాకా మరి. మొత్తానికి విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డుల వేటలో పడింది “వాలిమై”. ఇప్పటికి ట్రెండ్ అవుతున్న ఈ ఫస్ట్ లుక్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-