రజనీకాంత్ పనైపోయింది ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యునిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సినిమాను ప్రమోట్ చేశారు.
Also Read : Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జైలర్ 2 ఎనౌన్స్ మెంట్ టీజర్ చూసిన మూవీ లవర్స్ రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జైలర్‌లో క్యామియోస్‌తో సినిమాను పీక్స్ తీసుకెళ్లాడు నెల్సన్. శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్, మోహన్ లాల్ లాంటి త్రీ ఇండస్ట్రీల స్టార్లను రంగంలోకి దింపి కోట్లు కుమ్మరించేలా చేసిన డైరెక్టర్ ఈ సీక్వెల్లో కూడా బాలకృష్ణను తీసుకు రాబోతున్నట్లు గట్టిగానే బజ్ నడుస్తోంది. జైలర్ సీక్వెల్‌పై అంచనాలు డబులయ్యేలా చేస్తున్నాడు. ఇస్తున్న అప్ డేట్స్ అలాంటివి మరీ. మొన్న అనౌన్స్ మెంట్ టీజర్ వదిలితే రీసెంట్లీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. బిహైండ్ ది సీన్స్ వీడియో పూనకాలు తెప్పిస్తుంది. అనిరుధ్ మరోసారి మ్యాజిక్ చేసేట్లుగానే కనిపిస్తోంది. ఈసారి పక్కా థౌజండ్ క్రోర్ టార్గెట్‌గా ఫిక్స్ చేసుకున్నట్లు ఉన్నాడు నెల్సన్. అందుకే ఫస్ట్ నుండి ఇటువంటి మార్కెట్ స్ట్రాటజీలను అప్లై చేస్తూ సినిమా క్రేజ్ ను పెంచేస్తున్నాడు నెల్సన్.