రజనీకాంత్ సినిమా అంటే వన్ మ్యాన్ షోనే. ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా.. తన స్టైలిష్ ప్రజెన్స్‌తో మిగిలిన వాళ్ల ఫెర్ఫామెన్స్‌ను కిల్ చేసేస్తారు. అలాంటిది తలైవర్ సినిమాలంటే కిచిడీ చేసేస్తున్నారు మేకర్స్. మార్కెట్ కోసమో లేక స్పెషల్ అటెన్షన్ కోసమే తెలియదు కానీ మల్టీస్టారర్స్‌ను దించేస్తున్నారు. జైలర్ నుండి ఈ ప్రయోగం ఎక్కువౌతోంది. జైలర్ విషయంలో వర్కౌట్ అయ్యింది కానీ.. వెట్టయాన్, కూలీకి మిస్ ఫైర్ అయ్యింది. ఈ రిజల్ట్స్ కన్సిడర్ చేయని నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్2 కోసం మరింత మంది స్టార్ కాస్ట్ పట్టుకొచ్చాడు.
జైలర్2లో బాలీవుడ్ నుండి విద్యాబాలన్, మిధున్ చక్రవర్తిని సరికొత్తగా యాడ్ చేసిన నెల్సన్.. మాలీవుడ్ నుండి సూరజ్ వెంజర మూడును విలన్ చేసేశాడు. మోహన్ లాల్ అండ్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, విజయ్ సేతుపతి ఇందులో రిటర్న్ తీసుకుంటున్నారు. కానీ తెలుగు నుండి ఒక్క స్టార్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్ బిల్ట్ చేయలేదు నెల్సన్. జైలర్‌లో సునీల్ అండ్ తమన్నాతో ఫన్నీ లవ్ ట్రాక్ నడిపి సక్సెస్ కొట్టిన డైరెక్టర్.. ఈ మూవీలో అతి పెద్ద ఇండస్ట్రీని మర్చిపోయినట్లే ఉన్నాడు. యాక్చువల్లీ టాలీవుడ్ మార్కెట్ కోసం నెల్సన్ పెద్ద స్కెచ్చే వేశాడు. బాలకృష్ణను స్పెషల్ రోల్ కోసం అప్రోచ్ అయ్యాడు డైరెక్టర్. తొలుత అంగీకరించిన బాలయ్య.. ఆ తర్వాత తప్పుకున్నాడు. ఆ ప్లేసులోకి హృతిక్ రోషన్‌ను తీసుకొచ్చారని సమాచారం. ప్రజెంట్ ట్రైలర్‌లో హృతిక్‌ను హైడ్ అండ్ సిక్‌లో చూపించాడు డైరెక్టర్. ఈ సర్‌ప్రైజ్ క్యామియోను రివీల్ చేయలేదు. బాలీవుడ్ మార్కెట్ కోసం గతంలో కూడా అమితాబ్, అమీర్ ఖాన్ పట్టుకొచ్చారు జ్ఞానవేల్ అండ్ లోకేశ్ కనగరాజ్.. కానీ వర్కౌట్ కాలేదు.. ఈ సారి హృతిక్ ప్రజెన్స్ బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్‌కు ఎంతలా దోహదపడుతుందో లెట్స్ సీ.

