NTV Telugu Site icon

Neha Shetty: పేరు మార్చుకున్న నేహా శెట్టి? ఏంటో తెలుసా?

Neha Shetty

Neha Shetty

మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన భామ. అయితే చిన్నప్పుడే కుటుంబం బిజినెస్ రీత్యా బెంగళూరులో సెటిల్ అయింది. తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో చూసే పూరీ జగన్నాథ్ మహబూబా అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గల్లీ రౌడీ అనే సినిమాల్లో కూడా ఆమె నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆమెకు పేరు తీసుకురాలేదు. ఎప్పుడైతే ఆమె డీజే టిల్లు సినిమాలో రాధిక అనే పాత్రలో నటించిందో ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆ పాత్రతో ఆమె ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె బెదురులంక అనే సినిమాతో పాటు రూల్స్ రంజన్ అనే సినిమాలు చేసింది. బెదురులంక పరవాలేదు అనిపించుకున్న రూల్స్ రంజన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ భామ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Also Read; Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా

అయితే ఈరోజు రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో ఆమె అతిథి పాత్రలో కనిపించింది. తన రాధిక పాత్రలోనే ఆమె రెండు నిమిషాల పాటు కనిపించి ఒక్కసారిగా థియేటర్లలో అరుపులు పుట్టించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె పేరు మార్చుకుంది. ఇప్పటివరకు నేహా శెట్టిగా అందరూ ఆమెను పిలుస్తూ ఉండేవారు సినిమాలో కూడా నేహా శెట్టి అని మాత్రమే ఆమె పేరు పడేది. కానీ టిల్లు స్క్వేర్ టైటిల్ క్రెడిట్స్ లో మాత్రం ఆమె పేరు నేహా హరిరాజ్ శెట్టి అని పడింది. ఈ హరిరాజ్ ఎవరో కాదు నేహా తండ్రి. ఆయన పేరు హరిరాజ్ శెట్టి కాగా ఆయన పేరుని తన పేరులో యాడ్ చేసుకుని నేహా శెట్టి. అయితే ఇది ఆమె కావాలనే చేసుకుందాం లేక సినిమా యూనిట్ పొరపాటున తండ్రి పేరుతో కలిపి వేసిందా అనేది తెలియాల్సి ఉంది.

Show comments