Site icon NTV Telugu

#NBK 111 : మాస్ దేవుడు తిరిగొచ్చాడు..ఈ సారి మరింత గట్టిగా గర్జిస్తాం

#nbk 111, Nandamuri Balakrishna,

#nbk 111, Nandamuri Balakrishna,

నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది.  తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు… ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. ప్రజంట్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read : Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..

గోపీచంద్ మాలినేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆల్ మోస్ట్ మూవీ గురించి చాలా విషయాలే పంచుకున్నారు.. ‘బాలకృష్ణ తో స్క్రిప్ట్ డిస్కషన్ అయిపోయింది.. ఏ బ్యానర్ లో చేస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారు. డెఫినెట్ గా ఇదొక సాలిడ్ స్క్రిప్ట్. వంద శాతం ఒక కొత్త డైమెన్షన్ లో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీ ఇమేజినేషన్ కి అందదు’ అని తెలిపారు. అలాగే ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి.. ఈసారి అలాంటి కంప్లెయింట్ రాకూడదనే విధంగా వర్క్ చేస్తున్నామని గోపీచంద్ అన్నారు. అంటే ఈ చిత్రంలోనూ ద్విపాత్రాభినయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఏదైనా కథను బట్టి ఉంటుందన్నారు. ఆయన కామెంట్స్ తో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version