NTV Telugu Site icon

Nayanthara: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?

Nainathra

Nainathra

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందం,అభినయంతో ఈ అమ్మడు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను ధక్కించుకుంది. కాగా తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తోండగా, ఆమెతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందట. దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన అప్ డెట్స్‌కి మంచి ఆదరన లభించగా.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. జనాలు కూడా వీక్ ఎండ్ వచ్చింది అంటే చాలా OTTలో కొత్త మూవీస్ కోసం చూస్తున్నారు. ఈ లెక్కన ఈ ‘టెస్ట్’ మూవీ కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ ప్లాట్ ఫామ్.. రిలీజ్‌ డెట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.