Site icon NTV Telugu

ఓటీటీలోనే నయనతార ‘నెట్రికన్’

Nayanthara's Netrikann to release in OTT

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారానే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ విడుదల చేసింది. 2011 కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్పూర్తితో ‘నెట్రికన్’ తెరకెక్కుతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతుండటం విశేషం.

Read Also : జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు చేస్తోన్న ‘టైగర్’…

‘అవల్’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వంలో నయనతార నాయికగా విఘ్నేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. అజ్మల్ అమీర్, ఇందుజ, మణికందన్, శరణ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘నెట్రికన్’లో నయన్ కళ్ళు కోల్పోయిన యువతి పాత్రలో కనిపించబోతోంది. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె, ఓ కారు ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. తన దుస్థితికి కారణమైన వ్యక్తులను నయన్ ఎలా ట్రేస్ చేసిందన్నదే ఈ చిత్రకథ. ‘మెరీనా’ ఫేమ్ గిరీష్ సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Exit mobile version