Site icon NTV Telugu

Nayanthara : ఏకంగా 9 సినిమాలు లైన్‌లో పెట్టిన లేడి సూపర్ స్టార్..

Nainatara

Nainatara

ఇండస్ట్రీ ఏదైనప్పటికి.. కొంత మంది హీరోయిన్‌లు మాత్రం ఏజ్ తో సంబంధంలేకుండా, ఎక్కడ వారి కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటికి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో వరుస అఫర్‌లు అందుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. తన అందం నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి బిరుదు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి కారణం నయనతార టాలెంట్ తన టాలెంట్ ఏ తనను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ప్రజంట్ ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన కూడా కథానాయికగా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం నయన చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 చిత్రాలు ఉన్నాయట..

Also Read: karthik Aaryan : శ్రీలీల మ్యాటర్‌కు పుల్ స్టాప్ పెట్టిన బాలీవుడ్ హీరో..

ఈ లిస్ట్ లో ఒకటి ‘మన్నాంగట్టి సిన్స్ 1960’ ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండవది ‘టాక్సిక్’ ఇది కన్నడ చిత్రం.. యష్ నాయకుడిగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక మూడవది ‘డియర్ స్టూడెంట్స్’.. ఇది మలయాళ చిత్రం. నాలుగోది ‘రాకాయి’ ఈ మూవీకి సెంథిల్ నలసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐదో చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్ 2’ (అమ్మెరు2) . ఆరో సినిమా మలయాళంలో నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి తో కలిసి నటిస్తోంది టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఏడో చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎనిమిదో సినిమా నటుడు రవి మోహన్ కి జంటగా నటిస్తోంది దీనికి కూడా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలే. ఇక తొమ్మిదో చిత్రం ‘హాయ్’. ఇలా వరుస చిత్రాలు లైన్ లో పెట్టింది నయనతార. మరి ఇందులో ఎన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.

Exit mobile version