Site icon NTV Telugu

లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్

Nayanatara Signs to do 2 Movies with under 1 banner

సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో చాలామంది ప్రముఖులు డబ్బు పెట్టుబడి పెట్టారు. ఇందులో నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఉన్నారు.

Read Also : సమంత పేరు నుండి అక్కినేని ఆవిరైంది!

“చాయ్ వాలే” ఇప్పుడు సరికొత్త పెట్టుబడితో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకురావడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఒక సంవత్సరంలో పూర్తిగా పని చేసే 35 దుకాణాలను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక. ‘ఏంజెల్’ పెట్టుబడిదారులు సునీల్ సేథియా; సునీల్ కుమార్ సింఘ్వీ, మనీష్ మార్డియా, యూఎన్ఐ-ఎం నెట్‌వర్క్ లతో పాటు సినిమా ప్రముఖులు ఈ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టారు. ఇక నయనతార, విఘ్నేష్ శివన్ కాంబినేషన్లో ప్రస్తుతం ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే తమిళ చిత్రం రూపొందుతోంది.

Exit mobile version