Site icon NTV Telugu

Surrogacy Controversy: సరోగసీ వివాదంలో ట్విస్ట్‌.. నయనతార దంపతులు సేఫ్?

Surrogacy Controversy

Surrogacy Controversy

Surrogacy Controversy: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేడీ సూపర్ స్టార్ నయనతార సరోగసీ గురించే చర్చ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ఇటీవలే కవల పిల్లలకు తల్లిదండ్రులయిన విషయం విదితమే. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పడంతో అందరూ షాక్‌ అయ్యారు. సరోగసీ ద్వారా ఈ జంట పేరెంట్స్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి. ఇక తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయం కూడా తెల్సిందే.

గత కొద్ది రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. 2019 లో ఈ పద్దతి ద్వారా పిల్లలను కనడం చట్టరీత్యా నేరమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయినా చట్టాన్ని ఉల్లంఘించి నయన్.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే ఆమెను చిక్కులో పడేసింది. బయట ఇంత వివాదం జరుగుతున్నా ఈ జంట నోరువిప్పింది లేదు. విగ్నేష్ శివన్ ఈ వివాదంపై ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇచ్చేశాడు. “సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ నిన్ను చేరతాయి. అప్పటివరకూ సహనంతో వేచి ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు” అనే కోట్ ను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా కూడా మారింది.

న‌య‌న తార‌, విఘ్నేష్ శివ‌న్‌ సేఫ్‌?

అయితే ఇప్పుడు న‌య‌న తార‌, విఘ్నేష్ శివ‌న్‌ సేఫ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరు సరోగసిపై ఎన్ని వార్తలు వస్తున్నా అస్సలు స్పందించలేదు. దీనిపై బయట పడేందుకు ఏం చేయాలో సమానాలోచనలో పడ్డారు. అయితే ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. చివరకు సరోగసి వివాదం నుంచి బయట పడుబోతున్నారు కోలీవుడ్ స్టార్ కపుల్ న‌య‌న తార‌, విఘ్నేష్ శివ‌న్‌. కాగా.. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం ప్రకారం మేర‌కు న‌య‌న తార‌.. విఘ్నేష్ శివ‌న్‌ల‌కు ఈ వివాదంలో స‌మ‌స్య ఉండ‌ద‌ట‌. ఎందుకంటే స‌రోగ‌సీ ద్వారా పిల్లల‌కు జ‌న్మనిచ్చిన త‌ల్లి దుబాయ్‌ లో ఉంది. న‌య‌న్ సోద‌రుడు ఆమెను ఒప్పించిన‌ట్లు తెలుస్తుంది. దుబాయ్‌లో స‌రోగ‌సీ విధానానికి ఎలాంటి నిబంధ‌న‌లు లేవు కాబ‌ట్టి.. న‌య‌న్‌, విఘ్నేష్‌ల‌కు స‌మ‌స్య ఉండ‌బోద‌ని అంటున్నారు. అయితే వారు విచార‌ణ‌ను మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ట‌… మ‌రి ఈ వివాదం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version