Site icon NTV Telugu

Naveen Chandra: ఫ్యాన్’గా వచ్చాడు..సినిమాలో విలనయ్యాడు!

Naveen Chandra

Naveen Chandra

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులకు సుపరిచితం. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నవీన్ చంద్ర, హీరోగానే కాక వివిధ పాత్రలలో మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రతో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రానున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర మాస్ మహారాజ్ రవితేజకు ప్రతికూల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను బట్టి చూస్తే, నవీన్ చంద్ర లుక్, డైలాగులు ‘శివుడు’ అనే తన పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తాయి.

Also Read:Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

‘మాస్ జాతర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నవీన్ చంద్ర స్టేజ్ పై రవితేజ పాటకు రవితేజలా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వయంగా రవితేజ కూడా నవీన్ చంద్ర డాన్స్‌కి ముగ్ధుడయ్యారు. అంతేకాక, రవితేజ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి, తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ను పంచుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ, రవితేజ గారు, సూర్య గారు అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపారు. వారిద్దరి ముందు ఇలా మాట్లాడటం తనకు డబుల్ ధమాకా అన్నారు. ఒక మనిషిలా ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది రవితేజ గారిని చూసి నేర్చుకున్నాను అని చెప్పారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ నెగెటివ్ రోల్ వల్ల మంచి పేరు వచ్చిందని, ‘మాస్ జాతర’తో మరోసారి మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నానని తెలిపారు.

Also Read:Malavika Mohanan: ఆయనతో నటించాలని ఉన్నా..ఆ సినిమా నేను చేయట్లేదు !

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల* జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఎంతో పవర్ఫుల్ అయిన నెగెటివ్ రోల్‌ను పోషించడం విశేషం. ‘మాస్ జాతర’ ట్రైలర్‌ నవీన్ చంద్ర వాయిస్ ఓవర్తో, “కేజీ రెండు కేజీలు కాదురా! 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి” అనే గంభీరమైన డైలాగ్‌తో మొదలై గూస్ బంప్స్ తెప్పించింది.

Exit mobile version