Site icon NTV Telugu

Narne Nithin: సిగిరెట్ చుట్టూ ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం‌లో సంపద కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా, యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది.ఇక జూన్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు, సహ నిర్మాత సుబ్బారెడ్డి, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర, రఘు కుంచే, రచ్చ రవి, సంగీత దర్శకుడు కైలాషా మీనన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Jatadhara : ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. దేవుడు

ఇందులో భాగంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ..‘మా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా పాటలు, ట్రైలర్‌ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో నరేష్ గారు చెప్పే ఒక సంభాషణ ‘స్వయం విజయమే నిజమైన సక్సెస్’ అనే ఆలోచన చుట్టూ కథను తీర్చిదిద్దాం. సినిమాలో కథ అంతా సిగరెట్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ సంపద కూడా తన నటనతో మెప్పిస్తుంది. నా సినిమాల్లో ఎక్కువ పాత్రలు ఉంటాయి, ఎందుకంటే కుటుంబంలో ఎలా సభ్యులు ఎక్కువగా ఉంటారో, నా కథలు కూడా అలాంటి సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ సినిమా ఎవరినీ నిరాశ పరచదు, అన్ని విధాలుగా ఆకర్షిస్తుంది. మా టెక్నికల్ బృందం అందరూ ఎంతో శ్రమించారు. అయితే, మా కృషి మీ ఆదరణతోనే ఫలిస్తుంది. జూన్ 6న థియేటర్లలో విడుదలయ్యే ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

Exit mobile version