యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవలే “నాంది” అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో నటుడిగా ఓ మెట్టు ఎక్కిన నరేష్ కు చాలా కాలం తరువాత సక్సెస్ లభించింది. “నాంది” అల్లరి నరేష్ లో కమెడియన్ మాత్రమే కాదు అద్భుతమైన నటుడు అనే విషయాన్నీ బయట పెట్టింది. ఇక ఈ సినిమాతో మంది నటుడిగా తన మార్కును చాటుకున్న ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగు లేస్తున్నారు. కాగా నేడు అల్లరి నరేష్ బర్త్ డే.
Read Also : 5 నిమిషాల్లో “క్రిష్-4” కథ చెప్పేసిన నెటిజన్… హృతిక్ రియాక్షన్ ఇదీ…!!
ఈ సందర్భంగా ఆయన 58వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “సభకు నమస్కారం” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది అన్పిస్తోంది. పోస్టర్ లో అటువైపు తిరిగి స్టేజీపై మైక్ ముందు నిలబడి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపిస్తున్నాడు అల్లరి నరేష్. ఆయన జేబులో నోట్ల కట్టలు కూడా కన్పిస్తున్నాయి. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తుండగా… ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.