టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం.
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’. ఈ సినిమాలో నారా రోహిత్ యాంటీ కాప్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కథలో కీలకంగా ఉండడంతో పాటు నారా వారబ్బాయి నటనకు మంచి స్కోప్ ఇచ్చేలా ఉంటుందని టాక్. ‘ప్రతినిధి’, ‘అసుర’ వంటి సినిమాలతో గంభీరమైన పాత్రలకు పేరు తెచ్చుకున్న రోహిత్‌కు యాంటీ కాప్ రోల్ కొత్తదనం తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, వెంకటేష్‌తో సీన్స్‌లో ఆయన పాత్ర మరింత బలంగా నిలవనుందని తెలుస్తోంది.
Also Read: Nari Nari Naduma Murari: సంక్రాంతి మళ్లీ మొదలయ్యింది.. అసలైన ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’!
ఒకప్పుడు మిస్ అయిన అవకాశం ఇప్పుడు మరో రూపంలో తిరిగి రావడం నారా రోహిత్ కెరీర్‌కు మంచి టర్నింగ్ అనే చెప్పాలి. ఆదర్శ కుటుంబంతో మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యాడని, తన పోర్షన్లకు సంబంధించిన చిత్రీకరణ షురూ అయిందని లేటెస్ట్ టాక్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆదర్శ కుటుంబం విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫుల్ లెంగ్త్ సినిమా ఇది.
