Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్

Tollywood

Tollywood

Nara Rohit: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ త్వరలో తండ్రి ప్రమోషన్ పొందబోతున్నారు. ఆయన సతీమణి నటి శిరీష ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా శిరీష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ‘బేబీ బంప్’ ఫొటోషూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి-2’ చిత్రంలో శిరీష హీరోయిన్‌గా నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వివాహం జరిగిన కొన్నాళ్లకే ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతోషకరమైన వార్త తెలుసుకున్న నందమూరి, నారా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, శిరీష ఈ మధురమైన కాలాన్ని ఆస్వాదిస్తున్నారు.