ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో తెలుగు ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలపగా సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఒకటి నిర్వహించారు. నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ పార్టీకి బాలయ్య సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు.
Pooja Hegde: నోరు జారి అల్లు అర్జున్ ఫాన్స్ కి టార్గెటయిన పూజా హెగ్డే!
అయితే ఈ పార్టీలో పాల్గొన్న నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ గురించి ఒక్కమాటలో చెప్పమంటే ఎమోషనల్ అని అన్నారు. ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారు మనసులో ఉన్నది సూటిగా చెబుతారు. మొహమాటం ఎప్పుడూ పెట్టుకోరు అని అన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మొహమాటం అనేదే లేదు. ఏమనుకున్నారో అదే చెబుతారు, దగ్గరకు తీసుకునేప్పుడు కూడా అంతే బాగా దగ్గరకు తీసుకుంటారు. దూరం పెట్టినా అంతే దూరం పెడతారు అని అన్నారు. నన్నెప్పుడూ దూరం పెట్టలేదు కానీ కోపం వస్తే పెట్టాల్సిన వాళ్ళని పెడతాడని లోకేష్ అన్నారు.