‘దసరా’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న నాని, మాస్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా ఇండస్ట్రీలో “మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్”గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్‌గా మళ్లీ నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
Also Read : Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగ లెవెల్‌కి చేరలేకపోతున్న బాలీవుడ్ డైరెక్టర్స్..?
తాజా సమాచారం ప్రకారం, నాని పాత్రలో మూడు విభిన్న కోణాలు ఉంటాయని, అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ మాస్‌లుక్‌లో, రియలిస్టిక్ పాత్రల్లో కనెక్ట్ అయ్యే నాని, ఈసారి గ్రే షేడ్స్‌తో ఎలా ఇంప్రెస్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, మాస్ ఆడియెన్స్‌కి ఫుల్ మీల్స్ లా అనిపించేలా కంటెంట్ ఉంటుందని నాని లుక్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ప్రస్తుతం నానితో పాటు ఇతర నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.