Site icon NTV Telugu

Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!

Paradise

Paradise

నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్‌లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్‌లో పాల్గొనలేదు.

Also Read : Chiru Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో వెనుక అసలు కథ ఇదే

ఈ నెల 18, అంటే రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిజానికి జీకే విష్ణు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించాల్సి ఉంది, అయితే పలు కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇటీవల “అమరన్” అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

Also Read : Vijay Deverakonda:ఫిలింఫేర్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

రేపటి నుంచి జరగబోతున్న షూటింగ్‌కు ఆయనే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో నాని చిన్నతనం పోర్షన్‌ను షూట్ చేశారు. నాని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version