NTV Telugu Site icon

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ అప్డేట్ ఇచ్చారోచ్!

Paradise

Paradise

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమా ఈమధ్యనే షూట్ ప్రారంభమైంది. నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్‌ లో ట్రైన్ అవుతున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

Mahesh Reddy: నిర్మాత కొడుకు పెళ్లిలో చరణ్, ఎన్టీఆర్- మహేష్ మిస్సింగ్!

దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్‌ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుంది. ఇక నేడు నాని పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రా స్టేట్‌మెంట్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.