Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే ఒక డిఫరెంట్ రా అండ్ రస్టిక్ మూవీగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ రిజల్ట్ పట్ల ఆయన ఎలా ఫీలవుతున్నారో నాని సోదరి, నిర్మాత దీప్తి గంటా ఓపెన్‌గా చెప్పేశారు. తన కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె నాని సినిమాల ఎంపిక, ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రెండేళ్ల పాటు ఆ టీమ్‌తో కలిసి ఎంతో ఇష్టపడి చేసిన ఆ ప్రాజెక్ట్ విషయంలో నాని సంతృప్తిగానే, హ్యాపీగానే ఉన్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు.
‘ది ప్యారడైజ్’ రిజల్ట్ పట్ల నాని హ్యాపీగానే ఉన్నారా అన్న ప్రశ్నకు .. సినిమా అనేది ఒక ప్రాసెస్ అని, నాని ఆ టీమ్‌తో కలిసి రెండేళ్ల పాటు ట్రావెల్ చేసి చేసిన ప్రాజెక్ట్ అదని దీప్తి గంటా చెప్పారు. ఒకసారి సినిమా పూర్తయి రిలీజ్ అయ్యాక, దాని గురించి మళ్లీ రెండో ఆలోచన చేయరని.. అదొక మంచి అనుభవం మాత్రమేనని, నాని హ్యాపీగానే ఉన్నారని తెలిపారు. ‘అష్టాచమ్మా’ నుంచి ‘ప్యారడైజ్’ వరకు యాక్టర్‌గా నాని ఎదుగుదలను దగ్గరి నుంచి చూశానని, కథల ఎంపికలో ఆయన ఎప్పుడూ కరెక్ట్ నిర్ణయాలే తీసుకుంటారని చెప్పారు. సినిమాను ఏనాడూ లైట్‌గా తీసుకోరని, యాక్టింగ్ అయినా ప్రొడక్షన్ అయినా దాన్ని ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి వంద శాతం కష్టపడతారని గుర్తుచేశారు.
Also Read
- Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
- Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
- Crazy Crossover: సూర్య కోసం మమిత 'ప్రేమలు'కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే 'సీన్'లోకి నస్లెన్!
- Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
ఇక ‘ది ప్యారడైజ్’ సినిమాలో జడలతో కనిపించిన నాని గెటప్ తనకు బాగా నచ్చిందని దీప్తి గంటా అన్నారు. స్క్రీన్ మీద నానిని అలా ఎవరూ ఊహించి ఉండరని, ఆ యూనిక్ లుక్కే సినిమాకు పెద్ద ప్లస్ అయిందని చెప్పారు. మరోవైపు నానిని ఫ్యామిలీ హీరోగా ఇష్టపడే ఆడియన్స్ ఆ జానర్‌ను మిస్ అవుతున్నారన్న మాటపైనా ఆమె స్పందించారు. నాని ఎప్పుడూ అలాంటి లెక్కలు వేసుకుని సినిమాలు చేయరని, కథలో కొత్తదనం, ఛాలెంజ్ ఉందని అనిపిస్తే వెంటనే ఓకే చేస్తారన్నారు. ‘హిట్’ అయినా, ‘ది ప్యారడైజ్’ అయినా కథలో ఉన్న బలాన్ని నమ్మే చేశారని.. రేపు ఒక సింపుల్ లవ్ స్టోరీ నచ్చితే కచ్చితంగా అలాంటి సినిమా కూడా చేస్తారని దీప్తి గంటా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
-
Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!