The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్

The Paradise Ott Release Date

The Paradise Ott Release Date

The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చాయి కానీ, కంటెంట్ పరంగా చాలా ఫిర్యాదులు మొదటి నుంచీ వినిపించాయి. ఈ నేపథ్యంలో, Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న వెర్షన్ విషయంలో మేకర్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని, బయట బాగా ట్రోల్ అయిన కొన్ని ఎపిసోడ్‌లలో మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం.

నిజానికి, గత వారం Netflix Coming Soon‌లో ఈ సినిమాను యాడ్ చేసినప్పుడు, రన్ టైం రెండు గంటల ముప్పై నిమిషాలు అని చూపించడంతో థియేటర్ వర్షన్ నుంచి ఇరవై నిమిషాల సన్నివేశాలను తొలగించారని అన్నారు. కానీ చివరికి, రెండు గంటల యాభై నిమిషాల నిడివితోనే సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో కీలకంగా తొలగించిన సన్నివేశాలను పరిశీలిస్తే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన ధూమావతి సాంగ్ విషయంలో కొన్ని మార్పులు చేశారు. ఓటీటీ వెర్షన్ కోసం, నాని తల్లి పాత్రలో కనిపించిన సోనాలి కులకర్ణి చేసిన డ్యాన్స్ బిట్ ను నెట్ ఫ్లిక్స్ నుంచి పూర్తిగా తొలగించారు. అలాగే, ఆ సీన్లో నానితో చేసిన కొన్ని ఫైట్ సీన్స్ కూడా కట్ చేశారు.

ఇక థియేటర్లలో విజువల్ విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకుని, కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ రీ వర్క్ చేశారు. అలాగే, థియేటర్ వెర్షన్ పోస్ట్ ఎండ్ క్రెడిట్స్ బాగా ఫాస్టుగా రోల్ అవ్వగా, ఇప్పుడు దాన్ని కాస్త… పేర్లు చదువుకునే విధంగా స్లో చేశారు. అలా సినిమా నిడివిని కరెక్ట్‌గా సెట్ చేశారు.