Nani Directors : ప్యారడైజ్ లేట్.. బిజీగా నాని డైరెక్టర్స్

Nani Directors

Nani Directors

ప్రస్తుతం నాని ఫోకస్ అంతా ‘ది పారడైజ్’ పైనే ఉండడంతో, ఆయన కోసం కథలు రెడీ చేసిన డైరెక్టర్లు ఇప్పుడు వేరే హీరోలతో ముందుకు వెళ్తున్నారట. మరి నానితో ఆ దర్శకుల కాంబినేషన్స్ తాత్కాలికంగా ఆగాయా లేక పూర్తిగా మారిపోతాయా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాని కెరీర్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండడంతో వాయిదా పడుతుంది. ఆగస్టు 21కి రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ, సెప్టెంబర్ 25 కు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో తర్వాత చేయాల్సిన సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇతర దర్శకులు నాని డేట్స్ కోసం వెయిట్ చేయకుండా, వేరే హీరోలతో ప్రాజెక్ట్స్ లాక్ చేసుకుంటున్నారు.

నానితో ‘బ్లడీ రోమియో’ ప్రకటించిన సుజీత్, ఆ సినిమా స్టార్ట్ కావడానికి సమయం పడుతూ ఉండడంతో ప్రస్తుతం ‘ఓజీ 2’ పనులపై దృష్టి పెట్టాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ‘ఓజీ’ తర్వాత ‘ఓజీ 2’ లు చేయాలని చర్చలు జరిపిన దాన్ని పక్కన పెట్టి, నాని ప్రాజెక్ట్ ను టేక్అప్ చేశాడు. కానీ ఇప్పుడు నాని బిజీగా ఉండడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపుకే వచ్చాడు. ఎటు అనుకూలమైతే అటు షిఫ్ట్ అవుతున్న సుజీత్, ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ కూడా నానితో మరో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, డేట్స్ వెంటనే అందుబాటులో లేకపోవడంతో విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. అంటే నాని కోసం ఎదురు చూడకుండా, కెరీర్ లో గ్యాప్ రాకుండా దర్శకులు తమ ప్లానింగ్ ను మార్చుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. అయితే ఈ కాంబినేషన్లు క్యాన్సిల్ అయ్యాయని కాదు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ నానితో సినిమాలు చేసే అవకాశం ఉందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరోవైపు ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని చేయాల్సిన సినిమా బడ్జెట్ సమస్యలు, ఇతర ప్రాజెక్టుల కారణంగా ఆగిపోయిందని అంటున్నారు.