నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇపుడు యూనానిమస్‌గా సాలిడ్ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అటు రివ్యూస్ సహా ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. హిట్ 3 మాస్ మేనియా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాని. ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నాని మాట్లాడుతూ..
Also Read: AlluArjun : మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి వచ్చా..
‘అందరికీ నమస్కారం. ఇది ఒక అద్భుతమైన రిలీజ్‌డే. పొద్దున లేచి చూస్తే నా ఫోను మెసేజ్ లతో నిండిపోయింది. ఇండస్ట్రీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సినిమా గురించి అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా రిలీజ్ డేస్ చూసాను. ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ.. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. మీ అందరి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మీరు ఒకటేనని నమ్మిన ప్రతిసారి, మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేస్తునందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసి మీడియాకి థాంక్యూ సో మచ్. మీ సపోర్ట్ వలనే ఈ బ్లాక్ బస్టర్ సాధ్యమైంది. మే ఫస్ట్ స్టార్ట్ అయింది. మే అంత ఇది సెలబ్రేషన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రి కి అమెరికా వెళుతున్నాను. నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను. వచ్చిన వెంటనే మీ అందరినీ కలుపుకొని గ్రాండ్‌గా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుందాం. శైలేష్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది తన విజన్ కి ఒక టీజర్ ట్రైలర్ మాత్రమే. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే దిల్ రాజు గారికి థాంక్యూ సో మచ్. టికెట్ విషయంలో సపోర్ట్ చేసిన ఏపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కృతజ్ఞతలు. ఇది తెలుగు సినిమా సక్సెస్. రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ప్రతి సినిమాకి ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.