NTV Telugu Site icon

Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..

Untitled Design (3)

Untitled Design (3)

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సెన్సేషన్ సరిపోద శనివారం, నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. తమిళ నటుడు Sj సూర్య ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏపీ మరియుతెలంగాణలో నాని గత చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ అయిన 3 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది, ఓవర్సీస్ లోని ఉత్తర అమెరికాలో $1.5 మిలియన్ రాబట్టింది.

Also Read: Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..

మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. కేవలం మూడు రోజుల్లో ఉత్తర అమెరికాలో బ్రేకే ఈవెన్ ససాధించి లాభాల బాట పట్టింది. మరోవైపు సరిపోదా శనివారం బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో గత 24 గంటల్లో 204 K+ టిక్కెట్లు బుక్ చేయబడ్డాయి. దసరా, హాయ్ నాన్న తర్వాత నానికి ఇది వరసగా మూడో హిట్ సినిమా. ఆది, సోమవారాల్లో సెలవులు ఉన్నందున, భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవాకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరిపోదా శనివారం బుకింగ్స్ పరిశీలిస్తే విడుదల రోజు – 191K+ 2వ రోజు 194K, మూడవ రోజు  204K+ టికెట్స్ బుక్ అయ్యాయి. 4వ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగించి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా వెళుతోంది సరిపోదా శనివారం.

Show comments