NTV Telugu Site icon

Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..

Untitled Design (7)

Untitled Design (7)

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో.

Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు రాస్తూనే.. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్..

‘సరిపోదా శనివారం’ సినిమా నుండి బయటకు వచ్చాడు నాని. సో ఇక నాని నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాని తన నెక్ట్స్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో HIT  ఫ్రాంచైజ్ తీసుకువచ్చాడు. మొదటి పార్ట్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించగా, రెండవ పార్ట్ లో అడివి శేష్ నటించాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో హిట్ 3ని నిర్మించనున్నారు.ఈ దఫా పోలీస్ క్యారక్టర్ లో నాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబరు 5న మొదలు పెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. మరోవైపు నాని నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ లో మరో సినిమా స్టార్ట్ చేసాడు. బలగం చిత్రంతో నటుడిగా ఆకట్టుకున్న ప్రియదర్శి హీరోగా కోర్ట్ ‘స్టేట్ vs ఏ నోబడి’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇటు హీరోగా అటు నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్.

Show comments