NTV Telugu Site icon

Nani Comments : శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు : నాని

Untitled Design (8)

Untitled Design (8)

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం విజయ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Raed : Jr NTR : తమ్ముడు మోక్షజ్ఞకు అన్నయ్యలు ‘తారక్ – కళ్యాణ్ రామ్’ విషెష్..

విజయ వేడుకలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ..లవ్ యూ ఆల్. థాంక్ యు సో మచ్. ఈ వేడుక చూస్తుంటే మనసు నిండిపోయింది. చుట్టూ వరదలు వున్నాయి. చాలా మందికి కష్టంగా వుంది. ఇలాంటి పరిస్థితిలో సినిమాకి బ్రహ్మరధం పట్టిన ఆడియన్స్ కి థాంక్ యూ. సినిమా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. వివేక్ సిక్ అయిపోయినప్పుడు నేను కూడా రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశా. ఈ సక్సెస్ తెలుగు ప్రేక్షకులది. సరిపోదా శనివారం సక్సెస్ వివేక్ అకౌంట్ లో నే వేస్తున్నాను. జెర్సీలో అర్జున్ సక్సెస్ ఐతే సత్య రాజ్ ఎంత ఆనందపడతారో వివేక్ సక్సెస్ చూసి నేను అలానే ఆనందంపడుతున్నాను. మళ్ళీ కలసి పని చేసినప్పుడు కామెడీ తీద్దాం. ఆడియన్స్ సీట్లో పడిపడి నవ్వాలి. అది నా కోరిక. ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ ని ఒక ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశా. శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు. సినిమా నచ్చితే రోజూ రెచ్చిపోయేవాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థాంక్ యూ సో మచ్’ అన్నారు.

Show comments