NKR 21: 1000 మందితో కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Kalyan Ram NKR 21 Intense Climax Shoot With 1000 Artists Completed: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమెటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశారని, ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఖర్చు పెట్టిన క్లైమాక్స్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ క్లైమాక్స్ గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో ఉండబోతోంది. అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్ చేశారు.
Vijay Deverakonda: రష్మికతో నటించిన సినిమాలో విజయ్ తల్లి కూడా నటించిందని తెలుసా?
Also Read
యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది. సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా ఉండబోతోంది. హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోనున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
తాజావార్తలు
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!