NTV Telugu Site icon

NBK107: త్వరలోనే వేట ప్రారంభం

నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా సర్‌ప్రైజ్‌ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమా నుంచి ‘అఖండ’ న్యూ పోస్టర్ విడుదల కాగా.. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా వుండనుందని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చిన్న వీడియోతో నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. త్వరలోనే నటసింహ వేట ప్రారంభం కానుందని తెలియచేశారు. క్రాక్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్‌ మలినేని ఈ సినిమా కోసం ఎక్కువగా కసరత్తులు చేస్తున్నాడట. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.