Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్‌ని ఢీకొట్టేది ఇతనేనా?

Nagarjuna King

Nagarjuna King

Ashok Selvan: అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగ్- టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సూపర్ హైప్ ఉంది. రీసెంట్‌గా టబు ‘మహంతి’ ఝాన్సీ రాణి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన టీమ్, ఇప్పుడు మరో అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. సినిమాలో కింగ్‌ను ఢీకొట్టే బలమైన పాత్రలోకి ఓ వెర్సటైల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.

తమిళంలో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అశోక్ సెల్వన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో తన రోల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన ‘కర్ణా’ అనే క్యారెక్టర్ చేయబోతున్నారు. అయితే టాక్ ఏంటంటే.. ఈ సినిమాలో అశోక్ సెల్వన్ నెగటివ్ షేడ్స్ ఉన్న కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌గా, అంటే నాగార్జునకు ధీటైన మెయిన్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై నాగార్జున వర్సెస్ అశోక్ సెల్వన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.

అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో పాటలు, బీజీఎమ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నాగ్ వందో చిత్రం కావడంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పవర్‌ఫుల్ విలన్ ఎంట్రీతో ‘కింగ్ 100’ రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.