NTV Telugu Site icon

Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?

Muna Bhai3

Muna Bhai3

ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్‌ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.

అయితే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ చేయాలని హిరాని ఎప్పుడో అనుకున్నారు. పలు కారణాల చేత అది డిలే అవుతూ వస్తుంది. కానీ ఇన్నేళ్లు అది పట్టాలెక్కుతోంది. మూడోసారి మున్నాభాయ్‌గా సంజయ్ దత్ అలరించడానికి రెడీ అయ్యారు. ఇక వైరల్ న్యూస్ ఏంటి అంటే ఈ చిత్రంలో కీలక పాత్రకు నాగార్జునను అడిగారని, ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం.ఇక నాగార్జున ‘నా సామిరంగా’ మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీయలేదు. కానీ ఈ మధ్య పలు చిత్రల్లో వరుసగా ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ప్రజంట్ ‘కుబేర’లో ధనుష్‌తో, ‘కూలీ’లో రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘మున్నాభాయ్-3’లో సంజయ్‌తో జట్టు కట్టబోతున్నారట. ఇక పాత్ర ఎలాంటిదైనా హిరాని లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నాగ్ నటిస్తున్నారంటే కచ్చితంగా మంచి హిట్ అవుతుందుంది. ఈ వార్త నిజమైతే కనుక అక్కినేని ఫ్యాన్స్‌కి అది హ్యాపీ న్యూసే.