Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ ప్రయాణం, తన కుమారుల కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘గీతాంజలి’ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఆ సినిమా చేయడం అప్పట్లో తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో ఒకటని నాగ్ తెలిపారు. 1989లో రిలీజ్ అయిన ‘గీతాంజలి’ తన కెరీర్‌కు కొత్త దిశను చూపించిందని చెప్పారు. అలాంటి విభిన్నమైన స్టోరీని ఎంచుకునేందుకు అప్పట్లో ఇతర స్టార్ హీరోలు పెద్దగా ముందుకు రాలేదని, అయినప్పటికీ తాను ఆ ప్రాజెక్ట్‌ను చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
అదే తరహాలో నాగచైతన్య, అఖిల్ కూడా కెరీర్లో ధైర్యంగా అడుగులు వేయాలని నాగార్జున సూచించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకోవాలని తన కుమారులకు చెప్పారు. అయితే 1990లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలకు రిస్క్ చేయడం అంత సులభం కాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. అప్పట్లో వరుసగా కొన్ని సినిమాలు విఫలమైనా తిరిగి సక్సెస్ సాధించే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఒక హీరో సినిమాను తిరస్కరిస్తే వెంటనే మరో నటుడి వైపు వెళ్లిపోతున్నారని అన్నారు. “90ల్లో ఏడు సినిమాలు ఫెయిల్ అయినా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మర్చిపోతారు.. మరో నటుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు” అని నాగార్జున పేర్కొన్నారు. మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై కనిపించడం అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచింది. ఇదే సమయంలో తన కుమారుల కెరీర్ గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!