తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం కూలీ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్క్కిస్తున్నాడు. జైలర్ సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తూనే లోకేష్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు తలైవా. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ కూలీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: G.O.A.T : రెండు రోజుల్లో రిలీజ్.. హైప్ నిల్.. బుకింగ్స్ ఫుల్.. ఇదెక్కడి విడ్డూరం
ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుండి ఉపేంద్ర, మళయాలం నటుడు టామ్ చాకో, కట్టప్ప సత్యరాజ్ తో పాటు శృతిహాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. కాగా టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున
సూపర్ స్టార్ రజనీకాంత్ కు విలన్ గా సైమన్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఈ రోల్ గాను నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ ధర టాలీవుడ్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూలీ సినిమాలో నటించటానికి నాగార్జున ఏకంగా రూ.24కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. లోకేష్ కనకరాజ్‌పై నమ్మకంతో మేకర్స్ కూడా నాగార్జునకు అడిగినంత ఇవ్వటానికి రెడీ అయ్యారువాస్తవానికి నాగ్ హీరోగా నటించే సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఏడూ లేదా ఎనిమిది కోట్ల రూపాయలు. కూలీ కోసం దీనికి మూడు రేట్లు ఎక్కువ తీసుకున్నాడని విలన్ రోల్ కోసం ఈ చిత్రానికి ఎక్కువ రోజులు కాల్షీట్ ఇచ్చాడని ఆ మేరకు భారీ మొత్తం ఛార్జ్ చేసాడని సమాచారం. సూర్యను రోలెక్స్ గా చూపించిన లోకేష్ నాగార్జునను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.