Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: సినిమా రంగంలోకి అడుగుపెట్టే ప్రతి కొత్త హీరోకు మొదటి సినిమా విడుదల సమయం ఓ అగ్నిపరీక్ష లాంటిది. నెలల తరబడి పడిన కష్టం, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే, తొలి సినిమా విడుదలకు ముందు నటీనటులు పడే ఆందోళన, నేటితరం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తొలి సినిమా విడుదల వేళ ఉండే మానసిక ఒత్తిడి గురించి నాగార్జున మాట్లాడుతూ.. “మొదటి చిత్రం రిలీజ్‌కు ముందు రోజుల్లో మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడతాం, ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నిరంతరం పరిగెడుతూనే ఉండాలి.
ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయ్యే డెబ్యూ హీరోలకైతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తుంది. ఆ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ప్రశాంతంగా నిద్రపోవడమే. నిద్ర తప్ప వారికి వేరే దిక్కు లేదు” అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. ఇక నేటి తరం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ సోషల్ మీడియా ప్రభావాన్ని నాగార్జున ప్రముఖంగా ప్రస్తావించారు. “మా తొలి రోజుల సమయంలో సోషల్ మీడియా లేదు కాబట్టి మేము చాలా అదృష్టవంతులం. కానీ ఇవాళ సోషల్ మీడియా ఓ రాక్షసిలా మారింది. దానికి ఎలాంటి కనికరం ఉండదు. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు.. దీని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ఈ రంగంలోకి వచ్చే కొత్త హీరోలు మానసికంగా గట్టిగా సిద్ధపడి రావాలి” అని స్పష్టం చేశారు. తొలి సినిమా టెన్షన్ నుంచి మొదలుకొని సోషల్ మీడియా ట్రోలింగ్ వరకు నాగార్జున చేసిన విశ్లేషణ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Also Read
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
- Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
తాజావార్తలు
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!