Site icon NTV Telugu

Nagachithanya : నాగచైతన్య ‘ఎన్‌సీ 24’ షూటింగ్ అప్‌డెట్

Naga Chaithanya

Naga Chaithanya

మొత్తనికి ‘తండేల్‌’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు.  ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మించనున్నారు. ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

Also Read : Surya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సూర్య..

ఇక ఈ సినిమాకు సంబందించి ‘ఎన్‌సీ 24-ది ఎక్స్‌కవేషన్‌ బిగిన్స్‌’ అంటూ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో మూవీ టీం వర్కింగ్ గురించి చూపించారు. అలాగే లాస్ట్ లో చై లుక్ కూడా రివీల్ చేశారు. కాగా ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్తగా మేకోవర్‌ అయిన వైనాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే తాజాగా నాగచైతన్య నటిస్తున్న ఈ తొలి పాన్‌ ఇండియా సినిమా తాలూకు షూటింగ్‌ బుధవారం మొదలైంది. ఈ మిథికల్‌ థ్రిల్లింగ్ చిత్ర చై కి ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజంట్ టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా చిత్రాలు ఊహించని విధంగా రాబోతున్నాయి. మరి నాగచైతన్య ఈ తాకిడిని ఎంత వరకు తట్టుకున్ని నిలబతాడో చూడాలి.

Exit mobile version