Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటివరకు టాలీవుడ్లో 100 కోట్లకు పైగా బడ్జెట్ అంటే స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ లేదా భారీ ఫ్రాంచైజీ ఉండడం కామన్ థింగ్. కానీ ఇప్పుడు ఆ ఫార్ములాను ‘నాగబంధం’ మార్చబోతుందా? స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, అయినా 110 కోట్ల బడ్జెట్! ఒక్క పాటకే 10 కోట్లు, క్లైమాక్స్ కి 20 కోట్లు ఖర్చు చేశారట. అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మేకర్స్ ఇంత రిస్క్ ఎలా చేశారు? రికవరీ ఎలా ప్లాన్ చేస్తున్నారు?
‘పెద్దకాపు’ తర్వాత విరాట్ కర్ణ హీరోగా వస్తున్న రెండో పెద్ద సినిమా ‘నాగబంధం’. హీరోకి పాన్ ఇండియా మార్కెట్ లేదు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్ స్టార్ హీరోయిన్స్ ఏం కాదు. దర్శకుడు అభిషేక్ నామ కూడా స్టార్ డైరెక్టర్ లీగ్‌లో లేడు. ఇలాంటి కాంబినేషన్‌తో 110 కోట్ల బడ్జెట్ పెట్టడం ఇండస్ట్రీలోనే పెద్ద డిస్కషన్‌గా మారింది. సాధారణంగా ఇలాంటి బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే థియేటర్స్ లో కనీసం మూడు రెట్లు బిజినెస్ జరగాల్సి ఉంటుంది, అదే ఇప్పుడు మేకర్స్ ముందున్న మొదటి ఛాలెంజ్.
Also Read
అయితే మేకర్స్ కాన్ఫిడెన్స్‌కు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అనంత పద్మనాభస్వామి ఆలయం, నాగబంధం సంప్రదాయం, పురాణాలు, అడ్వెంచర్.. ఈ అంశాలన్నింటినీ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ట్రైలర్ విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ వ్యూస్ రావడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. విజువల్స్, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ‘నమోరే’ అన్న ఒక్క పాటకే దాదాపు 10 కోట్లు ఖర్చు చేశారు, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌కే మరొక 20 కోట్లు వెచ్చించారు. భారీ సెట్స్, సీజీఐ, పాన్ ఇండియా రిలీజ్.. ఇలా ప్రతి విభాగంలోనూ రాజీ పడలేదు.
కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది.. విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావచ్చు, కానీ కంటెంట్ నిలబెడుతుందా? అదే రేపు బాక్సాఫీస్‌ను నిర్ణయించబోతోంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు, ఎస్పీసీ సినిమాస్, జీ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థలు తీసుకోవడం సినిమాపై ట్రేడ్ కాన్ఫిడెన్స్‌ను చూపిస్తోంది, కానీ అసలు పరీక్ష మాత్రం జూలై 3 నుంచే మొదలవుతుంది. స్టార్ పవర్ లేకుండా కేవలం కాన్సెప్ట్, విజువల్స్, పాజిటివ్ బజ్‌తో 110 కోట్ల పెట్టుబడిని ‘నాగబంధం’ రికవర్ చేయగలదా, లేక మరోసారి భారీ బడ్జెట్ల రిస్క్ గురించే చర్చ జరిగేలాగా చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం బాక్సాఫీస్ నే చెప్పాలి.
తాజావార్తలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..